పుట:Andhraveerulupar025903mbp.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆకాలమున ఈష్టుఇండియా కంపెనీవారు హిందూదేశమున బ్రవేశించి మదరాసు, మచిలీపట్టణము లోనగుచోటుల చిన్నచిన్న కొట్లువెట్టి వ్యాపారము జేయుచుండిరి. ఔరంగజేబునకు గంపెనీవారికి నభిప్రాయము భేధించుటచే వారికి నిలువనీడ దొరకదయ్యెను. అపుడు కంపెనీవారు గోలకొండరాజ్యము సర్వాధికారములతో బరిపాలించుచున్న యక్కన్నమాదన్నల నాశ్రయించి సముద్రతీర ప్రాంతములను గౌలునకు బుచ్చుకొని వ్యాపారము జేయ నిశ్చయించి యుపాయాంతరము నన్వేషింప సాగిరి. గోలకొండ రాజ్యమున కంతటికి సుబేదారుగా నున్న పగడాల లింగప్ప యను నొకసరదారు రేవులలో గంపెనీవారి సామానులు దిగకుండ నాటంక పఱచి కంపెనీవారి విజృంభణము నంతయ దుదముట్టింప సిద్ధపడెను. కంపెనీవా రక్కన్న మాదన్న గారలతో స్నేహము సంపాదించుకొని పగడాల లింగప్పవలన దమకు గలుగుచున్న చిక్కులన్నియు నివేదించిరి. అపు డక్కన్న మాదన్నగారలు పగడాల లింగప్పకు నొకజాబు వ్రాసిరి. లింగప్ప యాజాబు నందలి "కంపెనీవారి వ్యాపారమునకు నాటంకము గలుగనీయకుము" అను వాక్యముజూచి యపటికి జేయునదిలేక యూరకుండెను. కంపెనీవారు వ్యాపారప సైనికబలము వృద్ధిచేయుట జూచి లింగప్ప అక్కన్నమాదన్న గారలకు దెలిపి కంపెనీవారు కొలదికాలములో స్వతంత్ర