పుట:Andhraveerulupar025903mbp.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1686 సంవత్సరములో నౌరంగజేబు సేనలతో గుల్బర్గాకు బోవుచున్నటుల బ్రయాణమై యాకస్మికముగ గోలకొండను ముట్టడించెను. తానీషా తనబలము నతంయు వినియోగించి యేడుమాసములు పోరాడి యోడిపోయెను. ఔరంగజేబు తానిషాను బంధించి 1687 లో దేవగిరి దుర్గముమీద జెఱబెట్టెను. అతడా కారాగృహమునందె మరణించెను.

అక్కన్న మాదన్నగారలు తానీషా సామ్రాజ్యమున క్రీ.శ. 1659 మొదలుకొని 1686 వఱకుండియుందురు. స్వామిభక్తి పరాయణులు సత్యప్రియులు నగు నీయాంధ్ర మంత్రివర్యు లకారణముగ జాతి ద్వేషపరాయణులచే వధింపబడిరి. అక్కన్నమాదన్నలతో గోలకొండ రాజ్య మంతరించెను. గోలకొండరాజ్య మష్టైశ్వర్యములతో నుంటకు నక్కనమాదన గారలు వినాశమగుటకు మహమ్మదు ఇబ్రహీము కారకుడు. అక్కన్న మాదన్నలు మరణించినను వారి చరిత్రము భారత జాతి యున్నంతవరకు సజీవముగ నుండ గలదు. అక్కన్న మాదన్న రచ్చనావడులు బెజవాడ కనకదుర్గాలయ సమీపమునను వారల సత్రము లను ప్రదేశము నందిగామ సమీపమున ముని యేటియొడ్డునను నేటికి దర్శనీయములుగ నున్నవి. అక్కన్న మాదన్నలు ధర్మసంస్థాపకులు. హిందూ మహమ్మదీయ సమ్మేళనమునకు వారు పాటుపడి దేశమాతకు బలి యొసంగ బడిరి. వారానాడు నాటిన బీజమె యిప్పటికి