పుట:Andhraveerulupar025903mbp.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారా యనుచు విచారింపనవసరములేదు. అక్కన్న మాదన్నయను నామము లాంధ్రులలో గానవచ్చుటవలనను జిరకాల మాంధ్రదేశమునందె వీరుంటవలనను నాంధ్రులతో బాంధవ్యము గానవచ్చుటవలనను వీరల నాంధ్రులనియె విశ్వసించి తీఱవలయును.

తానీషాయొద్ద మాదన్నగా రింతయనరాని గౌరవముతో మంత్రిపదవి నిర్వహించుచుండిరి. అక్కన్నగారు తానీషాయొద్ద సర్వసైన్యాధ్యక్షుడై రాజ్యక్షేమమునకై యావచ్ఛక్తి వినియోగించుచుండెను. మాదన్నగారు హిందూమహమ్మదీయుల కైకమత్యము ఘటించుచు భిన్నాభిప్రాయముల బాఱదోలుచు మిగుల జాగరూకతతో రాజ్యస్థితిగతుల నరయుచు రాజ్యపరిపాలనము గావించుచుండెను. అన్యశ్రేయసునకు సహింపని కొందఱు దుర్మార్గమున కొడిగట్టి యక్కన్న మాదన్నగారికి మహమ్మదీయ జాతికి భిన్నాభిప్రాయమును గల్గింప నారంభించిరి. అట్టివారిలో మహమ్మద్ ఇబ్రహీం అనువా డొకడు. ఇబ్రహీం తానిషాయొద్ద సర్వసైన్యనాయకుడుగ నుండి దుర్మార్గము లనేకములు గావించుచుండె. నాతని దొలంగించి మాదన్నగా రాస్థలమున నక్కన్నగారిని జేర్చిరి. అది మొద లక్కన్నగారి యొక్కయు మాదన్నగారి యొక్కయు మారణమున కిబ్రహీము తన యావచ్ఛక్తి వినియోగించుచుండెను. తానీషాయొద్ద నిచితమగు గౌరవ