పుట:Andhraveerulupar025903mbp.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దియొ తెలుపు"మని యడిగెను. అక్కన్న మిగుల వినయముతో మాదన్ననుజూచి 'నన్ను నీవెఱుగక పోవచ్చును. నేను పెద్దమ్మకుకుమారుడను, నీవు చిన్నమ్మకుమారుడవు. కావున మనమిరువురము సహోదరులము. ఇది నీకును నాకును మాత్రమె తెలియదగిన యంశము. నాయందింకముందు గూడ నిటులె భ్రాతృగౌరవ ముంచవలయు' ననెను. నాట గోలె మాదన్నయు నాతని ధర్మపత్నియు నక్కన్నగారిని మిగుల దయతో దిలకించుచు నింటనేయుంచి యాదరింపసాగిరట. ఈకథలోని సత్యాసత్యములను విచారింప బూనుట ప్రకృతముకాదు.

అబూహసన్ కుతుబ్‌షా యనునామాంతరముగల తానీషానామము మనము రామదాసుచరిత్రము పఠించిననాటనుండి వినుచునె యున్నారము. తానీషా మిగుల పరాక్రమశాలియై హిందూ మహమ్మదీయుల నైకమత్యముగ బాలించుచు గోలకొండ ముఖ్యస్థానముగ జేసికొని చిరకాలము రాజ్యమును బరిపాలించెను. ఇతనియొద్దనె మాదన్నముఖ్యమంత్రియై రాజ్యాంగములను నిర్వహించుచుండెను. అక్కన్న మాదన్నగారి లిరువురు సహోదరులనియు బింగళియను నింటిపేరు గలవారనియు, భారద్వాజస గోత్రులనియు దద్వంశీయులు చెప్పుచున్నారు. అక్కన్న మాదన్నగారల మేనల్లుడని మనము వినుచున్న కంచెర్ల గోపమంత్రియను రామదాసు సైతము నియోగియు, నాంధ్రుడు కావున నక్కన్న మాదన్నగారలు నాంధ్రులా,