పుట:Andhraveerulupar025903mbp.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగ్గరాజుపక్షమువారు చాలమందిధర్మపక్షమగు యాచశూరుని వైపు చేరిరి. సైన్యసహాయమున యాచశూరుడు చంద్రగిరి దుర్గము నొక్కుమ్మడి ముట్టడించెను. జగ్గరాయడు కొంతవఱకు బోరాడి పరాజయసూచనలగాంచి పటకుటీరమును వదలి రాజప్రసాదమునకు బారిపోయెను. పట్టువదలక యేబదివేల సైనికులను సమకూర్చుకొని యాచశూరవతంసుడు జంద్రగిరిని రెండు సంవత్సరము లెడతెగక ముట్టడించెను. జగ్గరాజు పదునేనువేల సైనికులతో గొంతకాలము ముట్టడికి నాగి రాయబారమునకు మరల బ్రయత్నించెను. యాచశూరుడు రాయబారుల దిరస్కరించి చంద్రగిరి దుర్గమును లోగొనెను. జగ్గరాజీ సంరంభమును జూచి పారిపోయెను. యాచశూరుడు రాజమందిరమున బ్రవేశించి కోటను స్వాధీనపఱచికొని విశ్వసనీయులగు సైనికులకు నుద్యోగములు నొసంగి పూర్వవస్తువు లన్నింటిని బయటికి దీయించి సామంత పౌరసమక్షమున శ్రీరంగరాయల పుత్రుడగు రామరాయ భూవిభునకు జంద్రగిరి రాజ్యము పట్టాభిషేకము గావించెను. బౌరులందఱును యాచశూరుని ధర్మపరతంత్రబుద్ధికిని స్వామిభక్తిని సంతసించి చంద్రగిరి రాజ్యమునకు మంత్రిగ నుండుమని ప్రార్థించిరి. కాని తన కర్తవ్యము నిర్వహింపబడినదని యాచశూరుదు తెలిపి తన రాజ్యమునకు నేగెను. పూర్వప్రభు వంశజుడగు రామరాజు