పుట:Andhraveerulupar025903mbp.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమకు బరిపాలకుండైనందులకు జగ్గరాజు దుష్టపరిపాలన మంతరించినందులకు బ్రజలు సంతసించి రాజ్యమున జిరకాలము మహోత్సవము లొనరించి తమయానందము బ్రకటించిరి.

ఈ యాచశూరుని విజయము క్రీ.స. 1601 లోనిదని చరిత్రకారుల విశ్వాసము. ఈ కథాంశమును న్యూయలు దొరవారు విజయనగర చరిత్రమునందు వ్రాసియున్నారు. దేశీయచరిత్రముల శోధించి వ్రాయబడిన దగుటచే నీకథ విశ్వసనీయమనక తప్పదు. తనప్రభునివంశమును నిలువబెట్టుటలో నెన్నియో కష్టములకోర్చి స్వామిభక్తి ప్రకటించిన వీరశిరోమణియగు యాచనాయకునకు ఆంధ్రవీరులు "రామరాజ రాజ్యస్థాపనాచార్య" బిరుదము నొసంగి తమశాశ్వత కృతజ్ఞతను బ్రకటించిరి. యాచశూరుని శూరత్వమును దామెర వేంగడపతి యిట్లు వర్ణించినాడు.

సీ. ఉత్తరమల్లూరియొద్ద దావల పావ
            విభుసి గొట్టిన నాటి విజయకలన
   తిరుమల జేరి ధాత్రిని మన్నెరాజుల
            బాఱదోలిన నాటి బాహుబలము
   చెంగలుపట్టు వీక్షించి లగ్గలుపట్టి
            యాక్రమించిన నాటివిక్రమంబు
   పాలెముకోట వెల్పల నాజి యతిరాజు
            జరుగ జేసిననాటి శౌర్యపటిమ