పుట:Andhraveerulupar025903mbp.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈఘోరహత్యల విన్నంతనె జగ్గరాజుపై నసహ్యము రంగరాజుకుటుంబముపై గనికరము ప్రతిపౌరునకు జనించెను. జగ్గరాజుపరిపాలనముపై నసూయవహింపని మనుష్యుడె లేడు. రాజ్యచక్రము కేలనుంచుకొని కపటనాటకము నాడించు నా జగ్గరాజు దుర్మార్గ వృత్తికి జంకి పౌరుడెవ్వడును మాఱాడ డయ్యెను. కాని లోలోన నందఱకు గోపము వృద్ధినొందెను.

ఈ దుష్కృత్యము లన్నింటిని గాంచి యాచశూరుడు మిగుల నాందోళనపడి తాను బ్రతికియుండియు, నధర్మమును వారింపజాలనందులకు విచారపడెను. యాచశూరు డొకదినమున జగ్గరాజునొద్దకు నొకదూతని బంపి "రంగరాజు రెండవకుమారుడు ఇంకను జీవించియున్నాడు. ఆతనిని నన్ను జంపి మామేనల్లుచే జంద్రిగిరిరాజ్యము నాచంద్రార్కస్థాయిగా బాలింపజేయు"మని వర్తమాన మంపెను. జగ్గరాజావృత్తాంతమువిని తాను వేయికనులతో జూచుచున్నను శత్రుశేషము మిగిలినందులకు జాల విచారపడి యాచశూరు డాబాలు నెటులేని జంద్రగిరిరాజ్య ప్రభువును జేయకమానడని తలంచి యుద్ధప్రయత్నములు మానుమానియు సంధి గావించుకొందమనియు రాయబారములు పంపెను. యాచశూరుడు సంధికియ్యకొనననియు జంద్రగిరి సామ్రాజ్యము నిలువబెట్టుటయో చేతగాకున్న నశించుటయో కర్తవ్యమనియు రాజద్రోహులకు రాజభక్తులకు సంధికనుకూలమార్గములు లేవని వర్తమానము చేసెను.