పుట:Andhraveerulupar025903mbp.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చుచున్న జగ్గరాజుగుఱ్ఱపుకాలు సురంగపు మొదట దిగబడెను. ఏదియో వింతవలె నున్నదని యాభాగము ద్రవ్వింప నందుండి బయటికివచ్చుచున్న సైనికులు, రంగరాజు, నాతని కుటుంబము బయటపడెను. జగ్గరాజీ ద్రోహమున బాలుగొన్న సైనికుల నందఱను జిత్రవధము గావించి యింకొక దృడతరమగు గృహమునందు రంగరాజు నాతని కుటుంబమును జేర్చి విస్వాసపాత్రులగు మఱికొందరు భటులను గావలిపెట్టి జాగ్రత్తగా మెలగ నజ్ఞాపించెను.

తనయత్నము నిష్ఫలము కాగానే యాచశూరుడు కొందఱువేగుల వాండ్రను జంద్రగిరిసేనానాయకుని యొద్దకు బంపి కొంతధనము లంచముగ నొసగజేసి జగ్గరాజు లేనపుడు కారాగృహపాలకుల జంపి కారాగృహద్వారముల దెఱచి తనకు వర్తమానము చేయునటుల గట్టడిజేసెను. జగ్గరాజు రాజ్యమునలేని తరుణము గనిపెట్టి సైన్యాధికారి కారాగృహ పాలకులను జంపించి కారాగృహద్వారములు తెఱపించి తనకు నమ్మకమైన దూత కీవార్తనువ్రాసిన జాబొసంగి యాచశూరునియొద్దకు బంపెను. దురదృష్టవశమున నాదూత జగ్గరాజుచేత జిక్కెను. జగ్గరాజు దొడ్డిగుమ్మము నుండి కోటలో బ్రవేశించి కారాగృహమును మరల బంధించి సైన్యాధికారిని నాతనితో గలిసిన యితరోద్యోగులను గూడ జంపించెను. ఈవర్తమానము యాచశూరుడు విని తనప్రయ