పుట:Andhraveerulupar025903mbp.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములుగా నున్నవనియు వీర వేంకటపతిరాయలచే బట్టాభిషిక్తుడైన రంగరాజే తమకు నిజమగు ప్రభువనియు యాచశూరుడు జగ్గరాజునకు వర్తమానమంపెను. జగ్గరాజు యాచశూరునిమాట పాటింపక చిక్కరాజుపేర దానె రాజ్యవ్యవహారములను నిర్వహించు చుండెను.

యాచశూరుడు చెఱసాలయందున్న రంగరాజు నెటులేని విడిపింపవలయునని విశ్వప్రయత్నములు చేసెనుగాని లాభములేకపోయెను. కారాగృహవాసుల వస్త్రము లుదుకు చాకలి వాండ్రను లోగొని వాండ్రకు లంచము లొసంగి శ్రీరంగరాయల ముగ్గురు కుమారులలో మధ్యవాడగు పండ్రెండు సంవత్సరముల బాలుని బట్టలమూటలలో బెట్టి బయటికి దెప్పించి యాచశూరు డాబాలుని తనయొద్ద నుంచుకొని పెంచుచుండెను. యాచశూరుని భేదనీతియు జగ్గరాజు దుర్మార్గము ఫలింప నెనిమిదివేల సైన్యముతో నలుగురు సేనానాయకులు యాచశూరుని గలిసిరి. యాచశూరుడు విశ్వాసపరులగు నిరువదిమంది సైనికులను బిలిపించి చంద్రగిరికేగి చెఱసాల పాలకునియొద్ద నుద్యోగమున గుదిరి యెటులేని రంగరాజును విడిపించుడని పంపెను. వారు చెఱసాల యధికారి యొద్ద స్నేహము సంపాదించుకొని కారాగృహమునుండి బయటికొక సురంగము త్రవ్వి వారి నా సురంగపు ద్వారమున బయటికి గొనివచ్చుచుండిరి. అంతకుమున్ను వేటకేగి తిరిగి