పుట:Andhraveerulupar025903mbp.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

ధాన్యాదులు ఆలు బిడ్డలను గొని తమ తమ యిరవులకు.... వెడలిపోయిరి. రామరాజు సోదరుడగు వెంకటాద్రి సంగ్రామమున మరణించెను. తిరుమల దేవ రాయలు ప్రాణభయ చేత విద్యానగరము చేరి సదాశివ రాయలను ధనకనక వస్తు వాహన ములను వెంటగొని పెనుగొండకు బారి పోయెను. సర్వతీ ద్విభాసురమై సురక్షితముగా నున్న విద్యానగరమునందకు పౌరులందఱు దిక్కుమాలిన వారై యెటుబోవ దరిగానక గడగడ లాడుచుండిరి. చుట్టుపట్టుల నన్ని వైపుల మహమ్మదీయ సైన్యము నిండిపోయెను. ఈ యదను గ్రహించి చుట్టుప్రక్కల నున్న యాటవికులు పలుమాఱు విద్యానగరమున బ్రవేశించి ప్రజలను హింసించి వారి ధనములను యధేచ్ఛముగా దోచుకొనిరి. పురములో నున్న పౌరులీపాట్లు పడజాలక రాజ్యము విడచి యెందో పోయిరి. కొంతకాలమునకు దురుష్క సైన్యము మరల విద్యానగరమున బ్రవేశించి యెనరించిన దురంతములకు అంతములేదు. నిరపరాధులగు పౌరుల నెందరనో చంపిరి. అవ మానముల పాలుచేసిరి. రాజ మందిరములు, దేవాలయ అంగడి వీధులు, పగులగొట్టి కాల్చి, మాడ్చి, నేలమట్టము గావించిరి. కొంతకాలమునకు విధ్యానగరమను జరిత్రలో దేనినేని గాంచి గుర్తింప రాని విధమున వినాశమొనర్చిరి. .......ద్ర సైనికుడు విద్యానగర ధనమును ఒంటెలతో నెక్కించి మోయించుకొని తమ రాజ్యనకు గొంపోయి యందు భాగ్యవంతుడయ్యెను.