పుట:Andhraveerulupar025903mbp.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జిక్కవచ్చునని సైన్యమధ్యభాగమునకు మేనాయెక్కి బయలు దేరెను. దురదృష్టవశమున రామరాజింతకు మున్నెక్కివచ్చిన యేనుగు బెదరి మేనామీద బడెను. వాహకులు భయవశమున నొడలెఱుగక మేనా విడిచి పారిపోయిరి. రామరాజు క్రిందబడియు దెప్పరిల్లి చెంతనేయున్న యున్నతాశ్వమునెక్కబోవ నిజాముషా సైనికులు రామరాజును బంధించి జయజయ ధ్వనులు గావించుచు నిజాముషాహయొద్దకు గొనిపోయిరి, వెంటనే నిజాముషాహ తన ఖడ్గమును బెరికి రామరాజు తల ఖండించి బల్లెము కొనకుగ్రుచ్చి హైందవసైన్యమునకు జూపించెను. తమరాజు మరణించుటకు హైందవసేన మిగుల జింతించి రణరంగమున దమకు విజయము దుస్తరమని పారిపోవుచుండ దురుష్కులు లక్షమంది ఆంధ్రసైనికులను అరటిచెట్టుల నఱికినటుల నఱికిరి. హిందూసైన్యము సర్వవిధముల నాశనమయ్యెను. చిరకాలమునుండి యభివృద్ధినొంది మహోన్నతదశకు వచ్చిన విద్యానగర సామ్రాజ్యము దైవవశమున నిటుల నాశ మొందెను. ఆంధ్రవీరులలో సుప్రసిద్ధుడును శూరవతంసుడునగు రామరాజు మరణముతో నాంధ్రుల సమగ్రసౌభాగ్యాతిశయము అదృశ్యమయ్యెను. రామరాజుతో నాంధ్రులస్వాతంత్ర్యేచ్చ యంతరించెను.

హైందూసైనికు లీవిధముగ బరాజయమునొంది తురుష్కులబారినుండి బ్రదుక దలచి విద్యానగరమునకు జేరి ధన