పుట:Andhraveerulupar025903mbp.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దళమును బంధింప నాజ్ఞాపించెను. హైందవసైన్యము శరవేగమున దురుష్కదళముపై బడెను. తురుష్కసైనికు లీసమయము గుర్తించి యీవలావలకునొత్తిగిలిరి. చాటుననున్న సరదారులు ఫిరంగులు తుపాకులు నొక్కమాఱుపేల్చిరి. ఆకస్మికముగా హిందూసైన్యము సంగరరంగమున మాడిపోయెను. ఈఘోరకృత్యము కనులార గాంచియు రామరాజు నిరుత్సాహపడక రెండువైపుల నిరపాయముగ నున్నసైన్యమును సంగరమునకు బురికొల్పెను. హైందవసైనికు లుత్సాహముతో ముందునకు నడువసాగిరి. హిందువులధాటి కాగజాలక తురుష్కులు వెనుకడగు వేయుచుండిరి. రామరాజు తనసైన్య విజృంభణమునకు మిగుల నానందించి వ్యూహమును బన్ని తురుష్క సైన్యమును జుట్టుముట్టిన విజయము క్షణములో సాధ్యమగునని నిశ్చయించి తానొక యున్నతమైన పీఠము వేయించుకొని వజ్రములు రత్నములు వరహాలు రాశిపోయించి జయప్రదముగా బోరాడిన సైనికులను సత్కరించుచు బ్రోత్సాహించుచుండెను. హిందువులు తురుష్కులఫిరంగుల బట్టుకొనుటకు మిక్కిలిసాహసముతో ముందునకేగిరి. అంతకుమున్నె యవి మందుచే నింపబడి యుండుటచే తురుష్కులాకస్మికముగా బేల్చిరి. అయిదువేలమంది మేటిశూరులు మరణించిరి. హైందవ సైన్యము నడిభాగమిటుల బలుమాఱు నశించుటజూచి రామరాజు తాను స్వయముగా సైన్యము నడిపిన ఫిరంగులు సులభముగా జేతికి