పుట:Andhraveerulupar025903mbp.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమయమునాటికి రామరాజు తొంబదియాఱు సంవత్సరముల వృద్ధుడని చరిత్రకారులు కొందఱు వ్రాసియున్నారు. తురుష్కులు కృష్ణానదిదాటిపైకి రానిశ్చయించుచుండ బ్రవాహమును దాటి రాకుండ రామరాజుబల మాటంకము గలుగ జేసెను. వా రేరేవునకువచ్చిన నారేవున కాటంకము గలుగు చుండెను. ఇట్లున్నలాభములేదని తురుష్కులు తమసైన్యమును రెండుచీలికలు చేసి కృష్ణదాటునటుల నటించి యొకతీరమున జేరిరి. రామరాజు బలమంతయు నా తీరమున కెదురు నిల్చి యాటంకపఱచుచుండెను. ఇంతలో మిగిలిన తురుష్కసైన్యము క్షణములో కృష్ణానదిదాటి యీవల కేతెంచి వ్యూహముల బన్నిరి. రామరాజుసైనికులు తురుష్కులు కృష్ణదాటి యెటుల రాగలిగిరో యని యాశ్చర్యపడుచు వారి నెదిరింపబోవుసరికి మిగిలినసైన్యము కృష్ణదాటి రాగల్గెను.

తురుష్కులు తమసైన్యమునకు మధ్యభాగమునందు మూడువరుసలుగా నాఱువందల ఫిరంగులను బెట్టిరి. ముందు వరుసలో మిక్కిలి పెద్దఫిరంగుల జేర్చిరి. వానివెనుక తుపాకుల జేర్చిరి. ప్రతిపక్షుల కీ నిర్మాణము కానరాకుండునటుల రెండువేల కాల్బలమును ముందుంచిరి. కొంతసేపటికి హిందూమహమ్మదీయ సైన్యములు సంగరమునకు దలపడెను. తురుష్కసైనికులు ధారాళముగా శరవర్షమును రామరాజు సైన్యముపై గురిపించిరి. రామరాజు సైనికులకు బ్రోత్సాహవాక్యముల బలికి తురుష్క