పుట:Andhraveerulupar025903mbp.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజాపురము చెంతగల మైదానమున సైన్యమునుంచిరి. యుద్ధకారణము గావలయునుగాన ఆలి ఆదిల్ షాహ రామరాజునకు దన పూర్వులనుండి గైకొన్న రాయచూరు, ముదిగల్లు దుర్గము లీయవలయునని వర్తమాన మంపెను. రామ రాజా వర్తమానము విని ఆదిల్ షాహ దుర్మార్గమునకు గృతఘ్నతకు మిగుల గినిసి యా రాయబారి నిట్టి సందేశములు తేకుండ బ్రదుకుమని శిక్షించి పంపెను. ఇదియ యాధారముగ గొని నవాబులందఱు విద్యానగర సామ్రాజ్యము ముట్టడించుటకు దృణకాష్ట జల సమృద్ధిగల ద్రోణనదీ తీరమున నివసించిరి. రామరాజు తురుష్కులంద ఱేకమై దనపైకి వచ్చుచున్నారని విని తోక త్రొక్కిన పామువలె నదరిపడి మహమ్మదీయ రాజ్యముల నిర్మూలనము గావింపక మాన నని ప్రతిజ్ఞావాక్యములు పలికి విరోధులు కృష్ణదాటి రాకుండ కొంతసైన్యమును నాటంకపరచుటకు బంపెను. రామరాజు తన రాజ్యమునందలి యన్నిభాగములనుండి సైన్యమును రప్పించెను.ఆఱులక్షల కాల్బలము లక్ష ఆశ్వికబలము సమకూర్చెను. తిరుమలరాయనికి లక్ష కాల్బలము, ఇరువదియైదువేల యాశ్వికదళము, ఐదువందల యేనుంగులు నొసంగి తురుష్కుల నెదిరింపబంపెను. అపరిమితసైన్యముతో నాతని వెనువెంట మరియొకసోదరు డగు వేంకటాద్రిని బంపెను. రామరాజు మిగిలిన సేనతో