పుట:Andhraveerulupar025903mbp.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తో వారిదూతల బరాభవించుచు దనయాజ్ఞలేనిది తనతో వచ్చు తురుష్కుడు ఆశ్వము నెక్కరాదని నిబంధన చేసెను. ఇది నవాబు లాలకించి "తమలో దాము భిన్నాభిప్రాయముగనుండుటచేతనే రామరాజిటుల మహమ్మదీయులను బరాభవించు చున్నాడు. రామరాజు రాజ్యమును హరింపకున్న తురుష్కరాజ్యము నశించుట నిశ్చయమని తమలో దాము కూడ బలికికొని యైకమత్యముతో వర్తించుచుండిరి. రామరాజు నెదిరించుటలో మహమ్మదీయులందఱు నేకాభిప్రాయులైరి. సంబంధములు గలసినగాని పూర్వవైరము లడుగంటి స్వాభిమాన మతిశయింపదని ఆదిల్ షాహకు నిజాముషాహ తన కూతురగు చాందుబీబీ నొసంగి వివాహము గావించెను. ఆదిల్ షాహ చెల్లెలిని నిజాముషా కుమారుడగు మూర్తిజా పెండ్లాడెను. గోలకొండనవాబు, బెదర్‌నవాబు, బరీదుషాహ వీరలతో గలిసిరి.

ఆదిల్ షాహ బయటికి మంచివానివలె నటించుచు దురుష్కులుచేయు దుండగములలో దా నేకీభవించుట లేదనియు నెటులో మిత్రభేధ మొనరించి వారలను మీకుబట్టి యొసంగుటకే వారితో గలిసియుంటినిగాని వేఱుకారణము కాదనియు రామరాజుకు వర్తమానమంపెను. పుత్రవాత్సల్యవిధియగు రామరాజావంచకుని వాక్యములను విశ్వసించెను. తరువాత నవాబులు నలువురేకమై ఆకస్మికముగా నొకదినమున