పుట:Andhraveerulupar025903mbp.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుమారుడగు చిన తమ్మరాజును వెంటగొని రాయచూరు ముదిగల్లు క్షేత్రములను సాదించెను. రామరాజుతో బగగొనిన బ్రదుకుట దుస్తరమని గ్రహించి ఆదిల్‌షాహ విధేయుడుగ నుందునని వాగ్దానము గావించెను. సైపు అయిస్ ఉల్‌ముల్కు అను సరదారు తిరుగబడి విజాపురమునవాబునోడించి రాజ్యమును హరించెను. రామరాజు కనికరించి తనతమ్ముడగు వేంకటాద్రిచేనాతనినిజంపించి పూర్వరాజ్యముయధావిధి ఆదిల్‌షాహకు దిరుగనిప్పించెను. ఇంకననేక పర్యాయములు రామరాజుసహాయముతో ఆదిల్‌షాహ తాను గోల్పోయిన తన రాజ్యమును మరల సంపాదించుకొన గలిగెను.

విజాపురము నవాబగు ఇబ్రహీం ఆదిల్‌షాహ క్రీ.శ. 1557 లో మరణించెను. అతని జ్వేష్ఠసుతుడు ఆలీఆదిల్‌షాహ విజాపుర రాజ్యమునకు నవాబయ్యెను. ఇటులుండ రామరాజు కుమారుడు మరణించెను. ఈ యవకాశము జూచికొని రామరాజు స్నేహమును సంపాదింపవచ్చునని ఆలీఆదిల్‌షాహ స్వల్పబలముతో విద్యానగరముజేరి రామరాజును బరామర్శించి చనిపోయిన కుమారునకు మాఱు నన్ను జూచుకొండని ప్రార్థించెను. రామరాజు ఆతనిభార్యయు నాబాలునిపుత్రవాత్సల్యముతో దిలకించుచుండిరి. రామరాజును నతనిభార్యను నతడు దండ్రివరుసతో దల్లివరుసతో బిలుచుచుండ వారిరువు రీతని కుమారుని బిలుచునటుల హృదయపూర్వకముగు ప్రేమతో బిలుచు