పుట:Andhraveerulupar025903mbp.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండిరి. విద్యానగర సామ్రాజ్యమును రూపుమాపుటకు రామరాయలను దల్లికోట యుద్ధములో ఘోరమృత్యువు పాల్పఱచుటకు నీ ప్రేమాస్పదుడగు కుమారుడె కారణమయ్యెను. ఎన్నివిధముల హృదయమిచ్చి రామరాజు వానిభార్యప్రేమించినను సహజక్రూరభావము నాదంపతులయెడ ఆలీఆదిల్ షాహ విడనాడజాలక సమయము వచ్చినపు డీప్రేమను సాధనముగాగొని జయింప యోజించి తనరాజ్యమునకు వెడలిపోయెను.

తనపూర్వులవలన గైకొన్న కల్యాణి, షోలాపురము నగరములు తన కిచ్చివేయ వలసినదిగా ఆలిఆదిల్ షాహ నిజాంషాహకు వర్తమాన మంపెను. నిజాముశాహ దూతను బరాభవించి పంపెను. ఆలిఆదిల్ శాహ రామరాజును గలసి అహమ్మదునగరు మీదికి దండెత్తిపోయి యారాజ్యము నందలి పెక్కు గ్రామములు రూపుమాపిరి. ఆసమయమున హిందూ సైనికులు మసీదులు కూలద్రోసి ఖురాను గ్రంథములను జింపిపాఱవేసి తురుష్కస్త్రీలను బరాభవించిరి. రామరాజు సైన్యమొనరించిన దురంతములకు లోన గోపించియు ఆలిఆదిల్ షాహ బయటికి దగిన ప్రతిక్రియ గావించితిమని యానందించెను. నిజాముశాహ రామరాజుతో సంధిగావించుకొని కల్యాణనగరము కోల్పోయినందుల కెంతయు బరితపించుచు ఇబ్రహింకుతుబ్ షాహతో సంధి గావించుకొని కళ్యాణనగరము ముట్టడింప బిలుచు కొనివచ్చెను. విజాపురపు నవాబు, రామరాజు, వారల నెదిరింప నమితబల