పుట:Andhraveerulupar025903mbp.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామరాయలతో సంధిగావించికొని విద్యానగర సంస్థానవినాశనమునకు మార్గము లన్వేషించుచు గాలము గడుపుచుండెను.

ఆకాలమున పోర్చుగీసువారు విస్తార సైనికబలముతో రేవుపట్టణముల నాశ్రయించికొని వ్యాపారము చేయుచుండిరి. రామరాజు వారును సంధిగావించుకొని తురుష్కసంస్థానముల కెట్టి సహాయము చేయకుండునటుల గట్టుదిట్టములు గావించుకొనిరి. రామరాజు సహజముగ దురుష్కద్వేషి కాడుకావున దురుష్క రాజ్యమున నుండజాలక వచ్చు తురకవారలకందఱకు నొకవీధి గట్టించి యిచ్చెను. వారికొక మసీదుగూడ గట్టించి తనరాజ్యమున వారలకుద్యోగము లొసంగెను. ఇబ్రహిం తన యన్నయగు జమ్‌షీదు కుతుబుషాహ తనను జంపునేమోయని రామరాజును శరణు గోరెను. ఒకగ్రామము నొసంగి యతని మిగుల బ్రేమతో రామరాజును చూచి క్రీ.శ. 1550 లో ఇబ్రహిం కుతుబ్‌శాహ నామముతో నాతనిని గోలకొండ రాజ్యాధిపతిగ నొనరించెను. నిజాముషా రామరాజునకు గానుకలుబంపెను. అదివిని ఆదిల్‌షాహకోపించి దురుసుమాటలాడి విద్యానగర సంబంధులగు రాయబారులను ఆదిల్‌షాహ పరాభవించి వెడలనడచెను. ఈసంగతి రామరాజు విని కోపించి నిజాముషాహను ఆదిల్‌శాహమీదికి బ్రోత్సహించి దండయాత్రకు బంపెను. ఆదిల్‌శాహ, నిజాముశాహదుర్గమునాక్రమించుకొనెను. క్రీ.శ. 1551 లో రామరాజు తన నాల్గవ