పుట:Andhraveerulupar025903mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్న రాజ్యమునంతయు మరల వశపఱచికొని విద్యానగర సామ్రాజ్యమును మహోన్నతదశకు దెచ్చెను. అంతియగాక కృష్ణదేవరాయల జీవితములో నెరవేర్పబడని మహమ్మదీయ సంస్థానాధీశులను లోగొనుట రామరాజు నెరవేర్ప యత్నించెను. ఈసందర్భమున దురుష్క సంస్థానములగూర్చి కొంచెము చెప్పవలసియున్నది.

విజాపురరాజ్యము ఆదిల్‌షాహ స్వాధీనమునందుండెను. అహమ్మద్ నగరరాజ్యము బుర్‌హడ్‌నిజాంశాహ స్వాధీనమునను, గోలుకొండరాజ్యము జమ్‌షిద్ కుతుబ్‌శాహ స్వాధీనమునను, బీడర్‌రాజ్యము ఆలీబేరీదు స్వాధీనమునందును నుండెను. ఈనాలుగురాజ్యములు విద్యానగరమునకు నుత్తర దిశయం దుండెను. తక్కినమువ్వురు నవాబులు రామరాజునకు నిష్టులుగా నుండిరి. ఆదిల్‌షాహ చిరకాలమునుండి విద్యానగరసంస్థానమునకు ద్వేషిగాన రామరాజునకు నటులె శత్రుగణములలోని వాడయ్యెను. రామరాజు సహాయము జాతగాగొని తక్కినమూడురాజ్యముల నేలు నవాబులు ముగ్గురు ఆదిల్‌షాహమీదికి యుద్ధమున కేగిరి. రామరాజు తనసోదరుడగు వేంకటాద్రిని కృష్ణా, తుంగభద్రా నదుల మధ్యనున్న అంతర్వేదిని, అచ్యుతరాయలు కోల్పోయిన రాయచూరును సాధింపుమని పంచెను. ఇందఱిధాటి కాగజాలక ఆదిల్‌షాహ తనదుర్బలస్థితిని కాలపరిస్థితులను గమనించి