పుట:Andhraveerulupar025903mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయలు పెక్కుతటాకముల నెలకొల్ప జీవనదులకు గాలువల దీయించి భూదేవిని సస్యసంభరితగ నొనరించెను. విదేశవర్తకమును దేశీయవర్తకమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. మనోహర శిల్పవిన్యాసముతో నలరారు జక్కని దేవాలయములు సభామందిరములు పెక్కుగట్టించెను. స్వయముగ నీనృపాలుడు వైష్ణవుడైనను శివకేశవులయెడ భేదబుద్ధి లేక సమముగ బెక్కు శివాలయములను వృత్తి స్వాస్థ్యము లొసంగెను.

రాయల కిరువురు కుమార్తెలు ఒకకుమారుడు గలరు. పెద్దకుమార్తెయగు తిరుమలాంబికను రామరాజు పెండ్లాడెను.రెండవకుమార్తెయగు వెంగళాంబను తిరుమల దేవరాయలు వివాహమాడెను. కుమారు డాఱుసంవత్సరములు మాత్రమె జీవించెను. ఈబాలునకు రాయ లాఱవయేటనే పట్టాభిషేకము గావించెననియు నితడు కాలవశమున గతింప తిమ్మరుసు విసముబెట్టి చంపించెనని తలచి రాయలు తిమ్మరుసు గ్రుడ్డు తీయించి కారాగృహముననుంచెననియు విదేశీయుల చరిత్రయందుగలదు. దేశీయ చరిత్రములందుగాని ప్రవాదములందుగాని తిమ్మరుసింతటి ద్రోహియను కధాంశము తెలియబడదుగాన నిది విశ్వసనీయముగాదు. రాయలపుత్రుడు గతించుటకు గారకుడు తిమ్మరుసని కృష్ణరాయలు భావించెననుట విశ్వసనీయముగాదు. ఇంతలో ఆదిల్‌షాహ రాయచూరుదుర్గమును హరింప నొక