పుట:Andhraveerulupar025903mbp.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాఱు వచ్చెను. రాయలు పరిజనముతో నెదిరింప వచ్చుచుండుట విని ఆదిల్‌షాహ పాఱిపోయెను. ఎటులేని బెల్గాము దుర్గమును స్వాధీనపఱచికొని ఆదిల్‌షాహను బంధింపకున్న యెడల రాయచూరుదుర్గమును హరింపకమానడని కృష్ణదేవరాయలు సంగ్రామ ప్రయత్నములు చేయుచుండెను. ఆ సంకల్పము నెరవేరకమున్నె క్రీ.శ.1530 లో శ్రీకృష్ణదేవరాయల మార్తాండుడు అస్తంగతుడయ్యెను.

అద్వితీయ పరాక్రమశాలి యగు కృష్ణరాయనితోబాటు ఆంధ్రవీరుల స్వాతంత్ర్యదీక్షయు నంతరించినది. ఆంధ్ర సామ్రాజ్య నిర్మాతలలో బ్రధమగణ్యుడగు శ్రీకృష్ణదేవరాయలు అద్వితీయ పరాక్రమముతో జిర కాలము రాజ్యమేలి యంత్యదశలో దన యేకపుత్రుని కనులముందు దాటిపోవని కాలపురుషుని దురంతకర్మఫలము. ఈమహావీరుని పవిత్రజీవితము వాజ్మయమందును, సామ్రాజ్యచిహ్నములు హంపి ప్రాంతమునను దర్శనీయములై యలరారుచున్నవి. ఆంధ్రజాతికి గృష్ణదేవరాయలు మఱచిపోరాని వేలుపు. ఇతనితో ఆంధ్ర స్వాతంత్ర్యరంగము ముగిసినది.