పుట:Andhraveerulupar025903mbp.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన సైనికులవలన దుర్గవాస్తవ్యుల కెట్టి యిక్కట్టులు రాకుండ గాపాడి దుర్గమును స్వాధీన పఱచికొని యచట గొంత సైన్యమును దన ప్రతినిధినుంచి విద్యానగరముచేరి యీసంగరమున బాటుపడిన వీరులకందఱ కుచితభంగి సత్కారములు చేసొ గౌరవించెను.

రాయచూరు గోలుపోయిన పిమ్మట ఆదిల్‌షాహ చేయునదిలేక తన దూతను గృష్ణరాయలు యొద్దకు బంపి తన దుస్థ్సితియు బరాజయమ నంతయు నివేదించుమనెను. గతమునకు క్షమించి రాయచూరు దుర్గము మాకొసంగుమని గూడ వర్తమానమంపెను. ఉదారశీలుడగు శ్రీకృష్ణదేవరాయలు ఆదిల్‌షాహ వచ్చి తప్పునొప్పుకొని నాకాళ్లు పట్టుకొనెనేని తప్పక రాయచూరుదుర్గము నిచ్చెదనని వర్తమానమంపెను. రాజ్యాశచే ఆదిల్‌షాహ యందులకు నంగీకరించెను. ఇరువురు ముదిగల్లునొద్ద గలిసికొనునటుల గట్టడిచేసికొనిరి. రాయలు నియమిత కాలమునకు ముదిగల్లుచేరెను. ఆదిల్‌షాహ రాయలునొద్దకేగిన బంధించునేమొ యను భయముచేతనో దురభిమానముననో నియతస్థలమునకు రాడాయెను. రాయలు కోపించి వెంటనున్నసైన్యముతో విజాపురము ముట్టడించి దుర్గమును రూపుమాపి విజయమునొంది యారాజ్యములోని కలుబరిగి దుర్గమును లోబఱచికొని ఆదిల్‌షాహచే బంధీకృతులై చెఱసాలలోనున్న బహమనిరాజుల మువ్వుర విడిపించి యందుబెద