పుట:Andhraveerulupar025903mbp.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిల్‌షాహ గొప్పసైన్యముతో గృష్ణదాటి యీవలకు వచ్చి యంతకుమున్నె యటనున్న కృష్ణరాయల సైన్యము నెదిరించెను. ఉభయసైన్యములకు భయంకరసంగ్రామము జరిగెను. ఈసంగరము కౌరవపాండవ సంగరమును బోలియుండెను. తురుష్కుల ధాటికాగలేక రాయలసైన్యము పాఱిపోవుటజూచి రాయలు సేనానాయకులచే బాఱిపోవువారల నఱికించెను. చచ్చిన సంగరముననే చావవలయునని రాయల సైన్యము మొక్కవోని బీరముతో దురుష్క సైన్యము నెదిరించి చిత్రవధ గావించెను. రాయల సైనికులు తురుష్క సైన్యమును రూపుమాపి పాఱిపోవువారల దరిమితరిమి చెండాడిరి. ఆదిల్‌షాహ యేనుగునెక్కి కృష్ణదాటి పాఱిపోయెను. సర్వసేనానయకుడు బంధింపబడెను. పలువురు తురుష్కులు కృష్ణలోబడి మరణించిరి. దీనులగు కాందిశీకుల జంపవలదని రాయలు తనసైన్యమున కుదారభావముతో నాజ్ఞాపించెను. ఈవిజయము క్రీ.శ. 1520 మేనెల 16 శనివారమునాడు చేకూరెనని చరిత్రకారులు చెప్పుచున్నారు.

రాయలింతతో సంతృప్తినొందక సైన్యముతో రాయచూరు దుర్గమును ముట్టడించెను. కోటలోనున్న సైన్యము ఇరువదిదినము లేకధాటిగ గృష్ణరాయల సైన్యముతో బోరాడి యపజయము నిశ్చయమని తెలిసికొని దుర్గద్వారములు తెఱచి శరణుగోరెను. రాయలు పురమునందు బ్రవేశించి