పుట:Andhraveerulupar025903mbp.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుఱ్ఱములను గొనితెచ్చెదనని రాయలయొద్ద గొంతధనము గొనిపోయి హరించి యాదిల్‌షాహ రాజ్యములో డాగి యాతని శరణుగోరెను. రాయలువానిని బట్టియిమ్మని వర్తమాన మంపగ ఆదిల్‌షాహ కులాభిమానము పురస్కరించుకొని వానిని దాచి తన రాజ్యమునకె రాలేదని వర్తమాన మంపెను. రాయ లీసందు జూచుకొని సంగరమునకు బయలువెడలెను.

బలవంతుడగు నాదిల్‌షాహను జయించుట సామాన్యకార్యము కాదని కృష్ణదేవరాయలు ఏడులక్షల మూడువేలమంది కాల్బంబులను, ముప్పదిరెండువేల ఆఱువందల మంది గుఱ్ఱపురౌతులను, ఐదువందల యేబదియొక్క యేనుగులను నింక గొందఱు పరిజనులను వెంట గొని జైత్రయాత్రకు బయలు దేరెను. వీరాధివీరులగు కామానాయకుడు, త్ర----రావు, తిమ్మప్పనాయకుడు, ఆదెప్పనాయకుడు, కొండమరెడ్డి, సాళువ గోవిందరాజు, మధురనాయకుడు, కుమారవీర శ్యామలరాయలు తమతమవెంట గొంతబలము నుంచుకొని కృష్ణరాయలను సైన్యసహితముగ మధ్యనుంచుకొని రాయిచూరు సమీపించిరి. యవన సంస్థానాధీశు లితరు లీ సమయమున ముట్టడింపకుండుటకై తిమ్మరుసుమంత్రి పరిమితబలముతో విద్యానగర దుర్గమును జాగరూకతో గాచియుండెను. విద్యానగరము నెవ్వరును దేరి చూడజాలరైరి.