పుట:Andhraveerulupar025903mbp.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్య శుభదాయకము. ఉభయపక్షములకు క్షేమకరమనక తప్పదు. విజయలక్ష్మి ద్వితీయుడై కృష్ణదేవరాయలు సింహాచలము, రాజమహేంద్రవరము, శ్రీకాకుళము, విజయవాడ, మంగళగిరి, మున్నగు క్షేత్రముల సందర్శించుచు బౌరులవలన సత్కృతులను బడయుచు, సుఖముగా గొంతకాలమునకు విద్యానగరసామ్రాజ్యమునకు జేరెను.

కృష్ణదేవరాయలు దాదాపుగనైదు సంవత్సరములు కవితారచనము విద్యాగోష్టులతో గాలముగడపెను. వినాశనమైన సైన్యము నభివృద్ధిపరచెను. దుర్గమును బాగుచేయించెను. పోర్చుగీసువారిసహాయముచే మరఫిరంగులు చేయించి దుర్గములందు నెలకొలిపించెను. కృష్ణదేవరాయలు గావించిన భాషాసేవయందు జాలభాగ మీకాలమున జరిగినటుల విశ్వసింపవచ్చును. క్ర్ష్ణదేవరాయలు బాలుడైయుండ రాయచూరు దుర్గమును మహమ్మదీయులు గైకొనిరి. రాయచూరు కృష్ణా తుంగభద్రానదుల మధ్యనున్న దృడతరమగు దుర్గరాజము. దాని నాదిల్‌షాహ పరిపాలించుచుండెను.

ఎటులేని రాయచూరుదుర్గము లోగొనినగాని తన పూర్వుల యాత్మకుశాంతి చేకూరదనియు విద్యానగర సామ్రాజ్యము సురక్షితముగాదని కృష్ణరాయలు తలంచి యాదిల్‌షాహ తనకు స్నేహితుడుగాన యుద్ధకారణముకొఱకు నిరీక్షించుచుండెను. సయ్యద్‌మర్కారు అనునొక తురష్కుడు