పుట:Andhraveerulupar025903mbp.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంగరమె మానెనో "యని తమలో దామనుకొని యుద్ధయత్నములుమాని యెవరిత్రోవను వారేగిరి. గజపతి యీమోసమును గ్రహింపజాలక యెటులేని సంధి గావించుకొనినచో కృష్ణరాయలముందు నిలుచుట కష్టమని తిమ్మరుసు చెంతకు రాయలయొద్దకు రాయబారినంపి సంధికియ్యకొన బ్రార్థించెను. రాయలు మిక్కిలి సంతోషించి యియ్యకొనెను. తిమ్మరుసుమంత్రి గజపతియొద్దకు బరిజనముతో డేగి గజపతి విద్యానగరసామ్రాజ్యమునకు సామంతుడై యుండునట్లును, ఆతనిపుత్రియగు తుక్కాంబను (ఈమెను అన్నపూర్ణాదేవి యందురు) రాయలకొసంగునట్లును, గట్టుదిట్టములు గావించెను. కృష్ణరాయలు తుక్కాంబను పెండ్లాడి ఓడ్రరాజ్యమును యథావిధముగ బ్రతాపరుద్రగజపతి కధీనము గావించి క్రీ.శ.1516 లో బూర్వదిగ్విజయ యాత్రను ముగించి గృహాభిముఖుడయ్యెను. కృష్ణరాయ లొనరించినది న్యాయబుద్ధితో జూచిన మోసమైనను రాజనీతిప్రకారము యోచించిన దోషముగాదు. చతురుపాయములతో నిది భేదోపాయము. ఏపాప మెఱుగని పాత్రసామంతులను మన్నించి బలవంతుడగు గజపతి కెప్పటియట్ల పూర్వరాజ్యమునొసంగి బంధితుల విడిపించి రాయలు జయము తన దనిపించుకొనెను. చిరకాలము పరస్పర ద్వేషములు లేకుండ నుభయరాజ్యము లభివృద్ధి నొందుటకుగాను దుక్కాంబికను బరిగ్రహించెను. కాన రాయలు గావించిన భేదోపాయము రాజ్యధర్మము.