పుట:Andhraveerulupar025903mbp.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిమ్మరుసుమంత్రి రాయలయనుజ్ఞ గొని పదియాఱు బంగారుపెట్టెల జేయించి యందు దివ్యాభరణములు ఒక్కొక్కలేఖయుంచి తనభటుల కొసంగి యొక్కొక్కటి పాత్ర సామంతులకు వేఱువేఱ బంపించెను. కృష్ణరాయలకు బాత్ర సామంతులకు వేగు నడువకుండగాచియుండు గూడాచారు లాభటులను బంధించి ప్రతాపరుద్రగజపతి కప్పగించిరి. రాజాభటుల యొద్దనున్న పెట్టెల బరిశీలింప నం దన్నిటిలో నమూల్యాభరణములు ఒక్కొక్కరహస్యలేఖయు గనవచ్చెను. ప్రతి లేఖయందును.

"మిత్రమా! మీరు గావించిన నిబంధనలు మా కంగీకారములు. గజపతిని బట్టియిచ్చిన మీకందఱకు మనకట్టడిప్రకారము నగరములు ధనము నొసంగుటకు నొడంబడితిని. నాయంగీకారము తెలుపుచు బంపిన యాసత్కారమును బరిగ్రహింపుడు" అనివ్రాయబడి క్రింద కృష్ణదేవరాయలసంతకముండేను. గజపతిలేఖలజూచి పాత్ర సామంతులందఱు కృష్ణరాయలకులోబడిరనియు దాను ప్రతిఘటించి లాభములేదనియు దలంచి రహస్య ప్రదేశమునడాగి భవిష్యత్కర్తవ్యమునుగూర్చి యోచించుచుండెను. పాత్రసామంతులందఱు "పరిమితసైన్యముతో రణరంగమునకు జేరినను గజపతి మూలబలముతో సహాయము రాడయ్యెను. రాయల సైన్యము సంగరమునకు సర్వసిద్ధముగానుండెను. "గజపతి సంధి కంగీకరించెనో, వెఱచి