పుట:Aananda-Mathamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

29


బ్రహచారి నవ్వి—— దొంగల చేతికి చిక్కినవాని భార్యను బిడ్డను జీవముతో పిలుచుకొని వచ్చితిని. వారిద్దఱిని మఠము నందు విడిచి పెట్టి వచ్చియున్నాను. నీవు మహేంద్రుని వెదకి వానిభార్యను బిడ్డను వానివశము చేయుము. ఇచ్చట జీవానందుఁడున్న చాలును; కార్యము నెఱువేఱు ననెను.

భవానందుఁడు——అట్లే కొని మ్మని చెప్పెను.

బ్రహ్మచారి—— వేఱో చోటికి వెడలి పోయెను.


ఏడవ ప్రకరణము

మహేంద్రుఁడు సిపాయీలకు లోఁబడుట

మహేంద్రసింహుఁడు, ఈ నిర్మానుష్య ప్రదేశమునం గూర్చుండి యాలోచించి ప్రయోజనము లేదని తెలిసికొని, రాజనగరమునకుఁ బోయి పోలీసు వారిని సహాయముగాఁ బిలుచుకొని భార్యను బిడ్డను వెదుకవలయు నని తలంచి, ఆమార్గముగాఁ బోవుచుండెను. కొంచెము దూరము పోఁగానే, ఒక యెద్దుబండి సిపాయీల పహరాతో వచ్చుచుండెను. రాజనగరము; లేక నగరము ఎయ్యది యనుదానిని యిపుడు చెప్పెదము.

వేయుయు నేడువందల డెబ్బదియాఱవ (1776) సంవత్సరమునందు వీరభూమి (Birbhoom) మొదలగు ప్రదేశములు ఇంగ్లీషువారిపాలనకు లోఁబడి యుండలేదు. ఆకాలమున ఇంగ్లీషువారు బంగాళా దివానులై యుండిరి. ఫౌజు దారియు వారికి