పుట:Aananda-Mathamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ఆనందమఠము


రుందురు. అందఱును ఆధరస్పందము చేయక యుండిరి. బ్రహ్మచారి మెల్లఁగా పోయి ఏదో సంజ్ఞ చేసెను. ఎవరును లేవ లేదు, ఎవరును మాటాడలేదు. చప్పుడైనను చేయలేదు. అంధకారమునం దెవరినో వెదకెడివానివలే ముఖమును చూచుచు పోయెను. ఇట్లు చూచుచు పోయి ఒకనిని చూచి వానిని స్పృశించి యేదో సంజ్ఞ చేసేను. వాఁడు లేచెను. వానిని పిలిచికోని చాలదూరము పోయెను . ఆపురుషుఁడు యౌవనవంతుఁడుగ నుండెను . వాని కృష్ణ కేశజాలము వాని చంద్ర వదనము నావరించియుండెను. వాఁడు కావివస్త్రమును ధరించి యుండెను. సర్వాంగముసు చందనముచే శోభితమై యుండెను బ్రహ్మచారి వానిం జూచి, 'భవానందా! మహేంద్రసింహుని వృత్తాం త మేమైనను దెలియునా?' యని యడిగెను.

భవానంద——మహేంద్రసింహుఁ డాదినమున ఉదయమున గృహమును విడిచి పెట్టి పెండ్లమును బిడ్డను పిలిచి కొని మూర్షిదాబాదుమార్గముగా ప్రయాణ మైవచ్చి, యొక పల్లెలో అంతలో బ్రహచారి— ఆ పల్లెలో జరిగిన సంగతి నాకుఁయును , ఎవరట్లు చేసినవారు?

భవానంద—— ఎవరో పల్లెటూరి రైతు లని తోఁచుచున్నది. ఈ కాలమున పల్లెలలోని రైతు లందఱును తిన కూడు లేక దారిదోపిళ్లు చేయుచున్నారు. ఈసమయమున ఏరైతు దొంగలింపకున్నాడు? మేముకూడ కొల్లగొట్టియే తినవలసి యున్నది. కొత్వాలువారికి రెండుబండ్లు బియ్యము పోవుచుండెను. దానిని తెచ్చి బ్రాహ్మణులకు పంచి పెట్టినాను.