పుట:Aananda-Mathamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

ఆనందమఠము


చేరియుండ లేదు, వారు కేవలము నేలపన్ను వసూలు చేయు అధికారులై యుండిరేగాని, బంగాళా దేశముయొక్క సివిల్, క్రిమినల్, పోలీసు ఇలాఖా అధికారములను వహియించి యుండలేదు. సిస్తు వసూలు చేయు అధికారము ఇంగ్లీషు వారిదిగను, జనులయొక్క ఆస్తి, ప్రాణము మొదలగు వాని సంరక్షణా వేక్షణ భారము ఆ పాపిష్టియు, నరాధముఁడును, విశ్వాసఘాతుకుఁడును, మనుష్యకులకలంకుఁడు నైన మీరజాఫరు చేతిలో నుండెను, ఈ మీరజాఫరుఁడు ఆత్మరక్షణమునందే సమర్దత లేనివాఁడు. వీఁడు బంగాళా దేశము నెట్లు సంరక్షింపఁ గలఁడు? మీరజాఫరునకు గంజాయి తాగుట, అభిని తినుట, అను నీ రెండు పనులకే కాలము చాలక యుండెను, ఇంగ్లీషు వారికి ధనము వసూలు చేసి కొనుట, డెస్చాచ్ (Despatch) వ్రాయుట, అను నీ రెండు పనులే యుండెను. బంగాళా దేశము నందుండు వారికి నిరంతరము ఏడ్చుట, నష్టపడినందులకై చింతించుచుండుట, అను నీ రెండు పనులే యుండెను.

బంగాళా దేశమునందు ఇవిసాధారణనియమములై యుండెను. వీరభూమి మొదలగు ప్రదేశములందు స్వతంత్రమైన రాజ్య ప్రణాళిక యుండెను అది వీరభూమి రాజు చేతియం దుండెను. రాజనగరము, లేక నగరము ఆ దేశమునకు రాజధానియై యుండెను. వీరభూమి రాజులు పూర్వమునందు స్వతంత్రులై యుండి ప్రకృతమున మూర్షిదాబాదు ప్రభువునకు లోఁబడియుండిరి. పూర్వమున వీరభూమియందు స్వతంత్రులైన హిందూ రాజు లేలుచుండిరి. ఇప్పటి రాజవంశస్థులు ముసల్మానులు, మనము ఏకాలపుకధను ప్రారంభించితిమో దానికి మునుపున్న