పుట:Aananda-Mathamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువది రెండవ ప్రకరణము

215


ఎడ్వ——ఎంతజనము?

వైష్ణ——కోటలో నెంద ఱున్నా రని యడిగెదవా? 20-25 వేల జన ముందురు.

ఎడ్వ——నాన్సెన్సు, ఒకకోటయందు 3-4 వేల జన ముండుటకే చాలదు. ఇంక నున్నారా? వెల్లిపోయిరా ?

శాంతి——ఎక్కడికి పోవుట?

ఎవ్వ——పరిసకు, కిండలకు.

శాంతి——కేందులికా, కేందులికి వారు పోరు.

ఎవ్వ——నీ వక్కడనుండి యెప్పుడు వచ్చితివి ?

శాంతి——నిన్న రాత్రి వచ్చితిని.

ఎడ్వ——వా రీదినము వెళ్లి యుండవచ్చును.

శాంతి యంతరంగమున నీ శ్రాద్ధము చేయింపకున్నచో నారసికత్వ మంతయు వ్యర్థ మనితలంచి, ప్రకాశముగా “ఓదొరా! అట్లుండవచ్చును, ఈదినము వారు బయటికి వెళ్లియుండ వచ్చును. సమాచారము నాకు సరిగా తెలియదు. నేను వైష్ణ విని; అచ్చట చ్చట పాడుచు బిచ్చము తెచ్చుకొని తినుదానను. ఆసమాచారము నాకేల? పాడిపాడి గొం తెండిపోయెను, ఏమైన నిచ్చిన తీసికొని వెళ్లెదను. కొంచెము హెచ్చుగా నిచ్చినచో ఎలుండి వచ్చి చెప్పఁగలను” అనియెను.

ఎడ్వర్ డ్సుదొర ఒక రూపాయి దీసి పడవేసి, ఎల్లుండికి కాదు బీబీ! నా కీదినము రాత్రికే వర్తమానము రావలెను.

శాంతి——మంచిది, నీవు ఒక బుడ్డి సారాయి త్రాగి తుపాకిని తల క్రింద నుంచికొని నిద్రపో, నీకు సమాచారము