పుట:Aananda-Mathamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

ఆనందమఠము


చెప్పుటకు నే నీదినము ఇరువది మైళ్లు పోయి రావలెను గదా? బాగుగ నున్నది హనుమంత రాయా!

ఎడ్వ——హనుమంత రాయఁ డనఁగా నేమి ?

శాంతి——అతఁడు మహావీరపురుషుఁడు, భారీ జనరల్.

ఎడ్వ——Great General! వానికన్నను బలవంతుఁడనై యున్నాను. క్లైవు వలేనే, అయినను నా కీదినము సమాచారము రావలెను. నూఱు రూపాయలు ఇనా మిచ్చెదను.

శాంతి——నూఱిమ్ము, వేయిమ్ము, ఇరువది మైళ్ల దూరము నడుచుటకు కాదు.

ఎడ్వ——గుఱ్ఱము పై నెక్కిపోతే?

శాంతి—— గుఱ్ఱముపై నెక్కుటకు తెలిసి యున్నచో నేనీ వేషముతో వచ్చి నీ తావున బిచ్చ మడుగుచుంటినా ?

ఎడ్వ——ఎవరైనను జీను వేసి కూర్చుండఁ బెట్టుకొనిన పోదువా?

శాంతి——ఇంకొకనితోఁ గూడనా ! నాకు లజ్జ కాదా ?

ఎడ్వ——కష్ట మేమి ? ఏనూఱు రూపాయ లిచ్చెదను.

శాంతి——ఎవరు పిలుచుకొని పోవువారు?నీ వేవచ్చెదవా?

ఎడ్వర్ డ్సుదొర, వ్రేలితో నెదుట నిలిచి యుండిన లిండ్లె అను నొక యౌవనపురుషుఁడైన ఎ౯సైనును (Ensign) జూపి, వానిని బిలిచి, "లిండై! నీవు పోయెదవా!" అని యడిగెను.

శాంతియొక్క రూపలావణ్యంబును గాంచి మిక్కిలి సంతోషముతోఁ 'బోయేద' ననెను.