పుట:Aananda-Mathamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియాఱవ ప్రకరణము

189


ధీరానంద—— నిన్నటిమాటను జెప్పెదవా? ఇంకనునాకుఁ దెలియలేదు కదా ! (ధీరానందుఁడు ఆహతుఁడైన యెఱ్ఱమూతి వానిని వధించేను.)

భవానంద—— లేదు. (ఈసమయమున నొక యెఱ్ఱమూతి వాని అఘాతముచే భవానందుని దక్షిణభుజ మూడి పడెను.)

ధీరానంద — నీవంటి పవిత్రాత్మునకు ఆమాటలను జెప్పుటకు నాకు సాధ్యమా ? నేను సత్యానందునివలనఁ బంప బడిన గూఢచారుఁడనుగా వచ్చియుంటిని.

భవానంద——అదేమి ! మహాస్వాములకు నాయం దంత అవిశ్వాసమా ! (భవానందుఁ డపు డోక చేతితోనే యుద్ధము చేయుచుండెను.) ధీరానందుఁడు అతనిని రక్షించుకొనుచు, “కల్యాణితో నీవు మాటలాడు చుండినదానిని వారు చెవులార విన్నారు” అనెను.

భవానంద——ఎట్లు ?

ధీరానంద——వారే యిచ్చటికి వచ్చి యుండిరి, హెచ్చరికతోఁ జూచికొనుము. (భవానందుఁడు తన్నుఁ గొట్టిన యెఱ్ఱ మూతివానిని కొట్టివేసెను.) వారు కల్యాణికి భగవద్గీతలను జెప్పియిచ్చుచుండిరి. అప్పుడు నీవు పోతివి.జాగ్రత్త ! (భవానందుని యెడమభుజము పడెను.)

భవానంద——నేను చచ్చినవార్త వారికిఁ దెలుపుము. నేను అవిశ్వాసిని కాను.

ధీరానందుఁడు బాష్పపూరిత లోచనుండై యుద్ధము చేయుచు, సర్వమును వా రెఱుంగుదురు. నిన్న వా రాడిన మాటలను జ్ఞాపకము చేసికొనుము. అదియునుగాక నాతో