పుట:Aananda-Mathamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

ఆనందమఠము


"భవానందుని తోడ నుండుము, వాఁ డీదినము చచ్చును. మరణకాలమున నే నాశీర్వదించితి నని చెప్పుము, పరలోకమున వానికి 'వైకుంఠ ప్రాప్తి గలుగును.” అని చెప్పిరి.

భవానంద——సంతానులకు జయ మగుఁగాక; స్నేహితుఁడా! నా మరణకాలమున కొకసారి “వందేమాతరం” అను గీతము చెవిని బడునట్లుగా గానము చేయుము, అనెను.

అపుడు ధీరానందుని యాజ్ఞ మేరకు యుద్దోన్మత్తులై యుండిన సంతాను లందఱు నతిగంభీరముగా "వందేమాతరం" పాడిరి. దానిచే వారికి బాహుబలము ద్విగుణ మాయెను. ఆ భయంకరమైన ముహూర్తమున మిగిలియుండిన యెఱ్ఱజనులు హతులై పోయిరి. రణరంగమునందు శత్రువులు మిగుల లేదు.

ఆసమయమున భవానందుఁడు "వందేమాతరం "పాడుచు, మనస్సున హరిచరణ ధ్యానము చేయుచు ప్రాణ త్యాగము చేసెను.

హా ! రమణీయరూపలావణ్యమా ! ఇహసంసారమునందు నీయధి కారము మిక్కిలి చెడ్డది ! నిన్ను కాల్పవలసినదే !


ముప్పది యేడవ ప్రకరణము

భవానందుఁడు నిహతుఁ డగుట

రణమునందు జయ మైన పిమ్మట అజయనదీ తీరమునందు సత్యానందునిఁ బరివేష్టించికొని విజయులైన వీరులు నానావి