పుట:Aananda-Mathamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

ఆనందమఠము


గ్లీషు సైనికులను జూచి "ఓ యాంగ్లేయులారా ! నే నేమో చచ్చితిని. ప్రాచీనపు ఇంగ్లాండు పేరును గాపాడుకోనుఁడు. మీపై ఏసు క్రీస్తు ఆన యున్నది. మొట్టమొదట నన్నుఁ గొట్టి పిదప నీవిద్రోహియగు కాఫరునిఁ గొట్టుఁ" డనియెను.

"బై" యని యొక తుపాకిగుం డెగిరెను. ఒకఁడు ఐరిష్ దేశపు కేప్ట౯ థామసు యొక్క తలకు గుణి పెట్టి తుపాకిని గాల్చేను. అవి లలాటమునకుఁ దగిలి కేప్ట౯ థామసు ప్రాణమును గైకొనెను. భవానందు డప్పుడు ఎలు గెత్తి చెప్పిన దేమనగా:— నా బ్రహ్మస్త్రము వ్యర్థ మాయెను. ఈ సమయంబున పార్థ వృకోదర నకుల సహదేవులవలే నుండువా రెవరు వచ్చి నన్ను గాపాడెదరు? చూడుఁడు; బాణహతమైన వ్యాఘ్రమువలే ఎఱ్ఱని జనులు నామీఁదికి వచ్చుచున్నారు. 'నేను చచ్చుటకై వచ్చి యున్నాను. నాతోఁ జచ్చుటకై సిద్ధులైన సంతాను లెవ రున్నారు? అనెను.

మొదట ధీరానందుఁడు ముందు పడెను. వానివెనుక జీవానందుఁడు——వాని వెనుక నొక్క రోక్కరుగను, గుంపులు గుంపులుగను సుమారు ఏఁబదుండ్రు జనులు వచ్చిరి.భవానందుఁడు, ధీరానందునిఁ జూచి, 'నీవు నాతోఁగూడఁ జచ్చుటకై వచ్చితివా!' యని యడిగెను.

జీవానంద——చచ్చుటకు నీక్కొక్క నికి మాత్రము హక్కు లేదు——అని చెప్పి యొకయెఱ్ఱమూతి వానిని ఆహుతునిఁగా గొట్టెను.

భవానంద——అది కాదు. చచ్చినచో ఆలుబిడ్డల ముఖమును జూచుకొని కాలహరణము చేయుటకు లేదు: