పుట:Aananda-Mathamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదినాలుగవ ప్రకరణము

177


పెక్కుమంది సంతానులు యుద్ధము చేయకయే ప్రాణత్యాగము చేసి భూశయ్యాగతు లైరి. 'ఒకఁడు జీవానందునిఁ గూర్చి 'జీవానంచా! నిరర్థకముగా ప్రాణిహత్య వలన నేమి ప్రయోజన"మనియెను.

జీవానందుఁడు వెనుకకు తిరిగి చూడఁగా, భవానందుఁడై యుండెను. జీతానందఁ 'డేమి చేయుదము? చెప్పు' మనేను,

భవానంద——వనముననే చెట్ల యొక్క యాశ్రయముచే ప్రాణరక్షణ చేసికొందము గుండ్ల బారికి చిక్కినచో భూమియే గతి. ఫిరంగులు లేక, ఈసంతాన సైన్య మొక్క నిమిష 'మైన నిలువదు, అయినను పొదలయందు దాఁగి యుండి చాల సేపు యుద్ధము చేయవచ్చును.

జీవానంద—— నీవు చెప్పినది నిజము. అయినను ప్రభువు ఫిరంగులను లాగుకొని రావలయునని యనుజ్ఞ చేసి యున్నాఁడు. అందుచేత మేము ఫిరంగులను లాగికోని రాఁబోవు చున్నాము.

భవానం—— ఫిరంగులను లాగికొని రానెవరికి సాధ్యము? అట్లు అవశ్యముగా పోవలసియే యుండినచో నీవు నిలువుము; నేను బోయెదను.

జీవానంద——అది కానేరదు, భవానందా! నేఁడు 'నే చచ్చుదినము.

భవానంద—— నేడు 'నేనును జచ్చుదినము.

జీవానంద—— నేను ప్రాయశ్చిత్తము చేసికొందును.

భవానంద——నీది నిష్పాప శరీరము, నీకుఁ బ్రాయశ్చిత్త