పుట:Aananda-Mathamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

ఆనందమఠము


ము లేదు, నామనస్సు కలుషిత మైనయది, నేనే చావవలసినది. నీవు నిలుపుము, నేఁ బోయెదను.

జీవానంద——భవానందా! నీవు చేసిన పాప మేమో నే నెఱుఁగను అయినను, నీ వుండినచో సంతానుల కార్యోద్దారమగును, నేను బోయెదను.

భవానందుఁడు కొంచెముసే పూరకుండి, తుదకు 'చావు స్థిరమై యున్న నేఁడే చత్తును. ఏనాడు చచ్చుటచే ప్రయోజనమో యానాఁడే చచ్చెదను, చచ్చుటకు కాలాకాలము లేమి?' అనెను.

జీవానంద——ఆట్లయిన రా,

ఇట్లు మాటలాడుచుండగనే భవానందుఁ డందఱకంటె ముందుగా నడిచెను. అప్పుడు దళదళములందును గుంపుగుంపు లందును గుండ్డుపడి సంతాన సైన్యమును ఖండ విఖండములుగా జేయుచుండెను; చించి చెండాడుచుండెను; తల క్రిందులుగాఁ జేయుచుండెను. ఇదియునుగాక, శత్రువులలో తుపాకిని ధరించిన సిపాయీలు గుఱి పెట్టి సంతానులను వరుసలు వరుసలుగా భూమిపైఁ బడునట్లు కొట్టుచుండిరి. ఇట్టి సమయంబున, భవానందుఁడు "ఈతరంగమునందు నేఁడు సంతానులు దుముక వలయును, ఎవ్వరు దుమికెదరు? ఈసమయమున 'వందేమాతరం' పాడవలయు” నని చెప్పెను. అప్పుడుచ్ఛస్వరముతో, మేఘమల్లారి రాగమునందు నాసహస్రసంతాన సైన్యము ఫిరంగి గుండ్ల తాళమునకు సరిగా 'వందేమాతరం' పాడిరి.