పుట:2015.373190.Athma-Charitramu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 106

కాలము వ్యర్థముచేయక, పెక్కు భోజనసదుపాయములకై తల్లిని వేధింపక, విద్యాపరిశ్రమముఁజేయ నిశ్చయించుకొంటిమి. ఆదినమే మిత్రుఁడు వెంకటరావు వచ్చికలసికొనుటచే నాయానందమునకు మితి లేకుండెను. నాఁడు నలుగురు స్నేహితులము నడిరేయివఱకును సంభాషణలతోఁ బ్రొద్దు పుచ్చితిమి. నా స్నేహితుఁడు కొండయ్యశాస్త్రి తాను జదువుకొనుటకు మా కావలివీథినున్న యొకయింట చిన్న గది యొకటి యద్దెకు పుచ్చుకొనెను. ఇపుడు నేను మాతమ్ముఁడును, దాని కెదురుగ నున్న గదిలోఁ బ్రవేశించి చదువనారంభించితిమి. ఆకాలమున బాడుగలు మిగుల స్వల్పము. మాగది యద్దె పావలామాత్రమె !

15 వ తేది ప్రొద్దున నాగదిలో మూఁడునాలుగు గంటలు చదివినపిమ్మట నింటికి భోజనమునకు వచ్చితిని. ఆఁకలిచేత నాకుఁ బ్రాణములు కడఁబట్టుచుండెను ! ఆ యసమయమున మా యమ్మ ప్రశాంతమనమున నొకకందమొలకకుఁ బూజలొనర్చుచుండెను ! నే నేమిచేతును ? గోరుచుట్టుమీఁద రోకలిపో టనునట్టు, నాయాఁకలి బాధకు నా ప్రబలవిరోధియగు విగ్రహపూజా సందర్శనము తోడై, నా కోపవహ్నిని రగులుకొలిపెను. దేవదేవునికిఁ జెల్లింపవలసిన పూజాపురస్కారము లీక్షుద్రవస్తువున కేల సమర్పించితి వని మా తల్లిమీఁద మండిపడి, నోటికి వచ్చిన వాక్కులు ప్రయోగించితిని ! కాని, కొంతసేపటికి చిత్తనిరోధము చేసి, శాంతించి, "సదుద్దేశమున నీ యిల్లాలు చేసెడిపూజల కేల నేను నొచ్చుకొనవలెను ? సాధువాక్యములతోనే సత్యదేవునివై పున కామెమనసును మరల్పుట కర్తవ్యము కదా !" అని నన్ను నేను సంప్రశ్నించుకొంటిని. హిందూ స్త్రీల మూఢత్వమునకై దైన్యమునఁ గన్నీరు విడిచితిని. తాము చేయు