పుట:2015.373190.Athma-Charitramu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 88

ఆ మేనెల 3 వ తేదీని మోగల్లులో మాతమ్మునియొక్కయు, పెత్తండ్రికుమారునియొక్కయు వివాహములు జరిగెను. శుభకార్యానంతరమున మేము రేలంగి వచ్చితిమి.

నా కీ గ్రామమున ప్రాఁతనేస్తుని సావాసము మరల లభించినదని చెప్పితిని. వెంకటరావు నేనును మా యాశయముల గుఱించి దీర్ఘ సంభాషణములు చేయుచువచ్చితిమి. అద్దమున ముఖము గోచరించువిధమున, స్నేహితునిభావము నందు మనశీలము ప్రతిబింబితమగు చుండును. మనసిచ్చి నెచ్చెలులతో మాటాడునప్పుడు, మన యాంతరంగిక రహస్యములు బయటపడుచుండును. మిత్రునిచేష్టలు మన కనులకు గోచరించునట్టె, మనచర్య లాతనికిని గానుపించి, యాతనివ్యాఖ్యానములకుఁ దావల మగుచుండును. వెంకటరావుసహవాసమున నా శీలపరిశీలనముఁ జేసికొనుచు, మిత్రునిగుణావగుణములను గ్రహించుటకు నా కవకాశము గలిగెను.

11 వ మే తేదీని నేను వెంకటరావును జూచుటకు వారింటి కేగితిని. అపు డతఁడు స్త్రీలచేఁ బరివేష్టితుఁడై, వారితో సరససల్లాపములు చేయుచుండెను. నా కిది మిగుల జుగుప్సావహముగ నుండెను. ఆఁడుపటాలము వెడలిపోయిన వెంటనే, చెలికానిని దల వాచునట్టుగఁ జీవాట్లు పెట్టితిని. అంగనల సరసను గూర్చుండి, ఆతఁడు కామోద్రేక ప్రసంగములఁ గాలము గడపుట చింతనీయ మని నే జెప్పివేసితిని ! సుదతులతోడి సద్గోష్ఠి సమంజసమే. కాని, వారు చెంత నుండినపుడు మృదువు మీఱినపలుకులు పురుషుల పెదవులనుండి వెడలినచో, రాను రాను స్త్రీలును తమ నై సర్గికమగు సిగ్గును విడనాడి, వెలయాండ్రవలె వలపుగొలుపు పలుకులు వచించుటకు వెనుదీయరు ! సద్భావపూరితుఁడగు నా స్నేహితునివంటి సంస్కారప్రియుఁడే, సంఘముయొక్క