పుట:2015.373190.Athma-Charitramu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. వెంకటరావు సావాసము 89

నైతికస్థితి నుద్ధరించుటకు మాఱుగా పామరజనపద్ధతులనే యవలంబించినచో, విద్యాధికులకంటె కపటనటు లెవరుందు రని నేను గట్టిగ నడిగివేసితిని !

రేలంగిలో నున్న దినములలోనే వెంకటరావునకు పునస్సంధానము జరిగెను. జీవితమునందలి తన యున్న తాశయములనుగుఱించి తన చిన్ని భార్యతో నపుడె ప్రస్తావించితి ననియు, ఆమె విద్యాభివృద్ధిఁ గావించుకొనినచో, స్వచ్ఛమగు పతిప్రేమముతోఁబాటు స్వాతంత్ర్యము నాసుదతి పడయఁగలదనియు, నామిత్రుఁడు నుడివెనఁట.

ఆ జూను 3 వ తేదిని నేను వెంకటరావును గలసికొనుటకు వారింటి కేగితిని. ప్రాఁతనేస్తుల మపు డా సాయంకాలమున మా వెనుకటిచరిత్రమును సింహావలోకనము చేసితిమి. తనసంగతి ముందతఁడు ప్రస్తావించెను. తా నెన్నియో బాధలకు శోధనలకును దావలమైతి నని నా మిత్రుఁడు పలికెను. దుష్టులలో నెల్ల దుష్టులతోను, శిష్టులలో శిష్టులతోడను తాను జెలిమిచేసి, తనవర్తననైర్మల్యమును గోలుపోకుంటి నని నాస్నే హితుఁడు నుడివెను. పలుమారు తాను సుడిగుండములఁ బడినను, ఆర్తరక్షకుని కృపామహిమమున శీలసౌష్ఠవ మనుభవించుచుంటి నని నాచెలికాఁడు చెప్పినప్పుడు, హర్ష పులకాంకితుఁడ నైతిని !

అంత నేను నాసంగతి విప్పితిని. మిత్రునకంటె దుర్బలశరీరుఁడ నైనను, దైవానుగ్రహమునను, సత్సహవాసమహిమమునను, నా శీలపవిత్రత సురక్షిత మని నా యుపోద్ఘాతము. కొలఁదికాలము క్రిందటనే, అనఁగా 1889 వ వత్సరమధ్యమున, వొక చెలికాని సహవాసఫలితముగ నేనును 'సైతాను' తాఁకునకు వశము కాలేదా ?