పుట:2015.372412.Taataa-Charitramu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాయలోబడిరి. ఆయూరపియను నౌకాసంఘములవా రేటేటను కోట్లకొలది రూప్యముల నార్జించి యార్జించి, చాలయైశ్వర్యముతో దులతూగుచుండిరి; వ్యాపారమున అనేక సౌకర్యములు గల్గియుండిరి. యూరపునుండి అన్నిప్రాంతములకు గొప్పవ్యాపారముచేయు నీమహాసంఘములకు, ఈబొంబాయి చీనాప్రాంతము లందుమాత్రము రెండుమూడేండ్లు నష్టమువచ్చినను, అదివారికొకలెక్కకాదు. వారికిపోటీగనున్న 'తాతాజపాను' సంఘము బాల్యస్థితిలో నున్నది; దానికంతగా మూలధనమును, తమకున్నవిశేష సదుపాయములును, లేవు. ఆ'తాతాజపాను' సంఘముకు సరుకులయెగుమతియే లేకుండ జేసిన, అది దివాలాతీయక తప్పదు; అంతట యూరపియనునౌకలు మరల కేవులనిచ్చవచ్చినట్లు హెచ్చింపవచ్చును. ఈమర్మమును తాతాముందుగనే తోటి బొంబాయివర్తకులతో తెల్పెను. కాని కొన్ని నెలలు బొంబాయివర్తకులు తమవాగ్దానము నిలుపుకొన్నను, ఉచితముగసరుకులబంపుకొని లాభమొందుదుమను పేరాసచే, వారిలోకొందరు తాము తాతాకిచ్చిన మాటకు భిన్నముగ పాశ్చాత్యనౌకలందే సరుకుల నెగుమతి చేయదొడగిరి; వారినిజూచి, మరికొందరును అట్లే చేసిరి. ఇట్లు యూరపియనుకంపెనీల తంత్రము సాగినది; సరుకులన్నియు వారియోడలందే చేరెను; 'తాతాజపాను' ఓడలకు సరుకులు లేవయ్యెను. ఇట్లు తోటివర్తకుల వ్రతభంగముచే, తాతాకు ద్రోహముజరిగెను; వ్యాపారము స్తంభించెను; నెలనెలకు