పుట:2015.372412.Taataa-Charitramu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేలకొలది రూపాయలు వెచ్చించి శ్రమకోర్చి నౌకలనడుపుచున్నను, ఎగుమతి లేనందున, తాతాయు జపానునౌకలును చేయునదిలేక, తుదకా నౌకావ్యాపారము నిల్చిపోయెను. జపాను నౌకలు తమదేశమునకు తిరిగిపోయెను. ఇట్లాయొడంబడిక చెడినందున, తాతాయు తాదెచ్చిన నౌకలను యూరపునకంపివేసెను. జపానీయుల కందుచే చిరాకును నష్టమునుకల్గెను. కాని ఈరీతిని భారతదేశముతో వర్తకానుభవముగల్గించి, యధాశక్తిగ వ్యాపార నీతి నమలుజరిపినందుకు, తాతాగారిని జపానీయులు మెచ్చుకొనిరి. తాతాయు తనసొమ్ము నష్టముకు అంతగా విచారించలేదు; కాని తోటివ్యాపారు లిట్లు దూరదృష్టి లేక, తత్కాలలాభమునే చూచుకొని, ఏకీభావమువదలి, మాటతప్పి, దేశహితముకు వ్యతిరేకముగ నడచిరనిమాత్ర మాయన చింతిల్లెను. తాతా యూహించినట్లే, 'తాతాజపాను' నౌకలుపోయిన కొద్దినెలలకే, యూరపియను కంపెనీలవారు తమ యోడలపైన కేవులను పూర్తిగా విధించిరి; మరియు బొంబాయివర్తకుల అసహాయతను గమనించి, వారిసరుకులపై కేవు రేటునింకను హెచ్చించి, యూరపియను కంపెనీలు తమ వెనుకటి స్వల్పనష్టమును గూడ వారివల్లనే రాబట్టిరి. తాతాసలహాను పెడ చెవిని బెట్టినందుకు తగుఫలితము కల్గెనని బొంబాయివర్తకుల కప్పుడు పశ్చాత్తాపము కల్గెను. వారిచ్చిన లిఖితనియమముకు భిన్నముగ నడచినందులకా తోటివర్తకులపైన నష్టపరిహారము పొందదగియున్నను, ఉదారు