పుట:2015.372412.Taataa-Charitramu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిక్కని తలచుచుండిన యూరపియనుకంపెనీలవా రీదృశ్యమును చూచి, మొదట దిగ్భ్రమజెందిరి. తాతాపన్నిన ప్రతియుక్తి వారికప్పుడు తెలియవచ్చెను. ఆకంపెనీలవా రంతట నసూయావిష్టులై, ఈ 'తాతాజపాను' నౌకల నెట్లైనపడగొట్టుటకు నిశ్చయించుకొనిరి. ఈ 'తాతాజపాను' నౌకాసంఘమువారు, చాలసరసమై న్యాయమగు రేటునకే సరుకుల గొంపోవుచుండిరి. అప్పటికి యూరపియనునౌకల కేవురేటు చాలహెచ్చు. కాని 'తాతాజపాను' కంపెనీకెట్లైన నష్టముకల్గించి యాయోడలసాగకుండ చేయుటకై, యూరపియనులు వెంటనే తమ హెచ్చు రేటుల వదలుకొనుటయేగాక, 'తాతాజపాను' వారిరేటుకన్న నింకను తమరేటులదగ్గించిరి. ఐనను, ఆరంభమున బొంబాయివ్యాపారులు తమసరుకులను చాలవరకు 'తాతాజపాను' నౌకలపైనే పంపుచుండిరి. అంతట యూరపియనునౌకలవా రొకతంత్రము పన్నిరి. తమ రేవులనింకను బొత్తిగతగ్గించి నామమాత్రముగ జేసియు, దానినిగూడ వదలుకొనియు, ఉచితముగనే బొంబాయినుండి చీనాజపానులకు తమనౌకలపైన సరుకులగొనిపోదొడగిరి. కాని అట్లు సరుకులబంపువారు, (తమకుపోటియగు) 'తాతాజపాను' నౌకలపైనమాత్రము మరియెట్టిసరకులను గూడ పంపగూడదని యాయూరపియనులు విషమనియమ మేర్పర్చిరి. ఈషరతుల ఉద్దేశము పోటీదారుల బడగొట్టుటయే యనిస్పష్టముగ కనబడుచున్నను, బొంబాయివ్యాపారులు క్రమముగా నా