పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

239


ప్రకటించి మంగళాష్టకములు చదువంగ
        రత్నములం దలఁబ్రాలుగాఁగ[1]
నగ్నిదేవుండు ప్రత్యక్షమై సాక్షిగాఁ
        దగ బ్రహ్మమునులు మంత్రములు సెప్ప
నిర్జరకాంతలు నివ్వాళులిడఁ[2] గల్ప
        వృక్షంబు లొగిఁ బుష్పవృష్టి గురియ


ఆ.

సురలు పరిణమింప సురదుందుభులు మ్రోయ
నారదుండు దీవెనలుగఁ బాడ
విశ్వమెల్లఁ బొగడ విశ్వావసునికూఁతుఁ
బరిణయించె ఖచరవరసుతుండు.

183


తే.

పరిణయోత్సవంబు జరిపి సిద్ధవిభుండు
గారవమున నెల్లవారి ననిపె
స్త్రీసమేతుఁడైన జీమూతవాహుఁడు
గురుపదాంబుజములు గోరి చనియె.

184


క.

జనకుని యనుమతి గతిపయ
దినములు రతితంత్రగతులఁ దేలుచు వనితా
జనతానురాగుఁడై చం
దనగిరిపై నతఁడు మనము దవియ సుఖించెన్.

185


ఉ.

అంతట నొక్కనాఁడు ప్రణయాన్వితుఁడౌ తమబావఁ గూడి ప
ర్యంతవనాంతభూమిఁ గలయం జరియించుచు వింతకాంతి న
త్యంతసముజ్జ్వలం బయిన యస్థిసమూహముఁ గాంచి పర్వత
ప్రాంతమున న్శరద్ఘననిభం బది యేటిది బావ నావుడున్.

186
  1. చేతనంబ్రాలుగాఁగ
  2. వాసుకీసుతులు నివాళింపఁగా. నిర్ణకాంతలు నిపళింపఁగా.