పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

సింహాసన ద్వాత్రింశిక


వ.

అతం డి ట్లనియె.

187


క.

పక్షీంద్రుఁడు పక్షానిల
విక్షిప్తం బైన జలధి వేఁటాడి మహా
చక్షుఃశ్రవముల నిత్యము
భక్షించుచునుండుఁ దొంటిపగ మొదలాఱన్.

188


క.

ఆగరుడికి వెఱచి మహా
నాగేంద్రుఁడు వచ్చి యనుదినము నొకపాము
న్నీగుంటికడకు నేనై
వేగమె పుత్తెంతు నింక వేఁటాడకుమీ.

189


ఉ.

దుర్భరపక్షపాతహతిఁ దోయధి పాయలుగాఁగ వచ్చు నీ
యార్భట మెల్లెడ ల్విని భయంబున నందు భుజంగమాంగనా
గర్భము లెల్ల నూడిపడఁగా నిది నీధనహాని[1] గావునన్
నిర్భకయవృత్తి నుండ గరుణింపుము నీకుఁ బ్రయాస మేటికిన్?

190


మ.

అని ప్రార్థించి యహీంద్రుఁ డేఁగి దినమర్యాదన్ ఫణిం బంపఁగా
విసతాపుత్రుఁడుఁ దించు నుండు నవి భావింప న్శతాసంఖ్యముల్
విను మా తెల్పు తదస్థికూటము జగద్విఖ్యాత మీతార్క్ష్యవ
ర్తన మిచ్చో మసనంబున న్నిలువ యుక్తంబౌనె లోకోత్తమా.

191


ఆ.

అనుచు దానశూరుఁ డగువానిమది నొండు
పుట్టకుండ మరలి పోద మనుచుఁ
బిలుచునంతఁ దండ్రి పిలువ బుత్తెంచిన
బాసిపోయె సిద్ధపతిసుతుండు.

192


ఆ.

అంత నక్కుమారుఁ డహిరాజు మది దూఱి
గరుడువలన నురగమరణములకు

  1. నిర్భరహాని