పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

శ్రీనివాసవిలాససేవధి


ద్రవిడాంధ్రములఁ గ్రంధము లెన్నియైన
సవరించితివి మాకు సంతసంబెసఁగ
నొక కృతి శేషాచలోరువైభవము
ప్రకటితాలంక్రియాస్పదవర్ణనలను
విసువక శృంగార వీరాద్భుతాది
రసములు భావముల్ రంజిల్లునట్లు
ద్విపద లోకులకెల్లఁ దెలివిడిగాన
ద్విపదగాఁ దెనుగునఁ దేటగావించు
వారాహ వామన బ్రహ్మాండ పాద్మ
గారుడ స్కంద మార్కండేయ ముఖ్య
బహుపురాణోక్తి సంబాధంబువలన
గహనమై పెనుగొన్న కథ చిక్కుదీర్చి
శరధిలోపల రత్నజాతంబు లేర్చి
మెరుగుసానను దీర్చి మెలకువఁ దేర్చి
భూషణంబొనరించు పొలుపున కర్ణ
భూషణంబుగను సల్పుము చెల్వు గుల్క."

అని యానతీయ, నాతఁడు వెంటనె మేల్కాంచి, పెక్కు పురాణములలోఁ జిక్కుపడియున్న శ్రీనివాసుల కథలలో, పునరుక్త కథను ద్రోచి, మొదలుతుద యేర్పరించి, పూర్వోత్తర విరోధములను దోచనీక, సర్వ సమాధాన సరణిని, భావుకభావ సంభావ్యతనలరఁ గావించి, పటుమహాకావ్యలక్షణములు వెలయ నందే వేంకటాద్రిమాహాత్మ్య మింపొందునట్లుగాఁ దెనుఁగున నీ ద్విపదకావ్యమును భూనుతవిఖ్యాతి పొసగ విరచింపఁ బూనినటులఁ జెప్పియున్నాఁడు. పిదప నా కృతిపతియగు ధవేంకటేశుని షడ్వి ప్రాకృత భాషలలో - ననఁగా - ప్రాకృతము, శౌరసేని, మాగధి, పైశాచి, చూళికోక్తి, భాండీరం అనువానిలో స్తోత్రము