పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

5

చేసినాడు. ఈ కవి సంస్కృత ప్రాకృతములందును, ద్రవిడాంధ్రములందును పెక్కు కావ్యములను రచించి, యింతకు బూర్వమే తన కర్పించినట్లుగా నా వేంకటాచలపతి యితని కలలోఁ జెప్పుటను బట్టి తెలియవచ్చుచున్నదే గాని యీతని యితర గ్రంథములేవియు నింతవరకు గానరాలేదు. ఆరు ప్రాకృతములలోని యల్పరచనలు మాత్ర మీ గ్రంథముననే గానవచ్చుచున్నవి. ఈతనిది ద్విపదరచనయే యైనను దాని నీతడు

"చటులార్ధకల్పనల్‌ శబ్దసందర్భ
మొరపొంద మాధుర్య ముల్లసిల్లగను
వరున పద్దెనిమిది వర్ణనల్ గులుక
నతుల శృంగార వీరాద్భుతరసము
లతిశయింపగ విభావాది భావములు
భావుక భావ్య సంభావ్యత నలరఁ
గావించి పటు మహాకావ్యలక్షణము
వెలయఁ దెనుంగున ద్విపదకావ్యముగ "

రచింపఁబూనినట్లు చెప్పికొన్నాఁడు. అట్లీ రచన ద్విపదయే యైనను మహాకావ్యలక్షణములతోఁ గూడినదై యే యున్నదనుటకు సందేహములేదు. వేంకటాద్రిమాహాత్మ్యమును, శ్రీనివాసుని విలాసములను వర్ణించు గద్యపద్యాత్మకములగు గ్రంథము లనేకములున్నను, ఈ ద్విపదరచనయే చక్కని తెనుఁగుదనముగలిగి, కావ్యలక్షణములతోఁ గూడి వానికన్న మిన్నయేమై యున్నదని చెప్పఁదగియున్నది.

ఈ వేంకటార్యుని తండి పేరు కృష్ణయార్యుఁడు, తల్లి లక్ష్మి. ఈతఁ డశేషదేశికులకెఱగి "వాధూల వంశావతంసుడగుఁ నస్మదాచార్యు నన్నావి యప్పలాచార్యు" ని భజియింతునన్నాఁడు. దీనిని బట్టి యితఁడు వాధూలవంశావతంసుఁ డగు అన్నావి అప్పలాచార్యుల