పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

359


నాతని నందుంచి యతిరయంబునను
భీతుఁడై యరిగి య బ్బిలమార్గమునను
శ్రీవేంకటేశ్వరుఁ జేరి దైన్యమున
సేవించి యశ్రువుల్ జెంద నిట్లనును
వారిజేక్షణ! శ్రీనివాస! నిర్వ్యాజ 1250

కారుణికాత్మ! సకలలోకనాథ!
నేను మత్తత నుండి నిష్ఠురాఘంబుఁ
బూనితి విప్రుని పొలఁతిని శిశువు
పొలియించు హత్యలు పొందితి మిగుల
బలువైన విశ్వాస పాతకంబునకుఁ
బాలైతి నే నట్లు బ్రాహ్మణుఁ జూచి
యేలాగు నీవుంచు నింతియు సుతుఁడు
పొలిసిరి నీవింక పొమ్మను వాఁడ
నిలుకడ ధర్మంబు నీరుగాఁ బుచ్చి
యీమేను బెట్టుక యెట్టుల నతని 1260

మోమునఁ బల్కుదు మూర్ఖత నేను
నా తప్పుఁ గాచి యో నగధారి యిట్టి
పాతకంబులు మాన్చి బ్రతికించు నన్ను
ఎలనాగ బ్రతికిన నే బ్రతుకుదును
చెలిమిన ద్విజనతి జీవితం బొసఁగు
కాదేని నన్ను నో కమలాక్ష [1]నీదు
పాదపద్మముఁ జేర్చు పాటి గావించు
మని విన్నవించిన నా శ్రీనివాసుఁ
డనుపమకరుణచే నవనీంద్రుఁ జూచి
చిరునగ వాననసీమఁ దళ్కొత్త 1270

  1. "కమలాక్షనిందు" వ్రా. ప్ర. పాఠము.