పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

360

శ్రీనివాసవిలాససేవధి


హరుషంబు దనర నిట్లని యానతిచ్చె
భూనాథ నీ వేల పొగిలెద వింత
నేను గల్గియు నీకు నిష్ఠురవ్యధలు
రానిత్తునే తత్తరంబిక మాను
పూని యిచ్చోటికిఁ బూర్వభాగమున
శరశతద్వయదూర సమ్మితస్థలిని
సర మొక్క టున్నది శమననిర్హారి
యా తీర్థమున వారి యస్థిచయంబు
పూతంబుగా నింత ప్రోక్షించినంత
నిదురించి మేల్కాంచు నీటు వాటిల్ల 1280

సుదతియు బాలుఁడున్ శోభిల్లఁగలరు
వారి న వ్విప్రుని వశమున నొసఁగి
భూరివైభవములఁ బొగడొందు మవని
ననుచు విష్వక్సేను నటు చూచి నీవు
జనపాలునకు నట్టి సరము గన్పించు
మనుటయు నా నృపాలాగ్రణి హరికి
వినతులు గావించి వినుతించి యపుడె
తనరాణివాసంబు తరుణుల తోడఁ
దనర నద్దేహముల్ దగ పల్లకీల
నుంచుక తెమ్మని యొక మంత్రి వేగ 1290

బంచిన నతఁ డట్ల పనిఁబూని యరిగి
నిమిషమాత్రనె దెచ్చి [1]నేతకుఁ దెల్చ
ప్రమద ముప్పొంగ సంభ్రమము చెలంగ
నతఁడు వేంకటనాథు నాజ్ఞ చొప్పుననె

  1. " శ్రీపతికిదెల్ప " అని వ్రా. ప్ర. పాఠము.