పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

శ్రీనివాసవిలాససేవధి


దన చెంత నిల్చు బిత్తరి గౌరిఁ జూచి
నెనరున లాలించి నీలకంఠుండు
తగ నూరడించి కుంతలములు దువ్వి
నగుచు [1]నేలనె వంత నగరాజపుత్రి!

వేంకటాద్రియందు తపముసల్పు కుమారునియొద్దకు శివపార్వతులు వచ్చుట.


నీ పుత్రుఁ డిప్పుడా నీరజనేత్రు
శ్రీపతిని గురించి శ్రీ వేంకటాద్రి
నొక సరస్తటమున నొగి వాయుదేవుఁ
డకలంకపతము సేయంగ నావంక390
నిలిచి నేమంబుతో నిష్ఠురవ్రతము.
సలుపుచున్నాఁ డట్టి శైలంబునందు
నొంటియే సనకాదియోగీంద్రు లబ్ధి
గుంటబెట్టుక గుటగుట గ్రోలు తపసి,
పదమునఁ జూపు చొప్పడు జడదారి,
మొదలుగా నెందరే మునులు వేవేలు
వేలుపులసురలున్ వేడ్కనుండుదురు
వాలాయముగ శౌరి వారికిఁ గరుణఁ
బ్రత్యక్ష మగు రమాప్రభుఁ జూడ మనము
నత్యంతరయమున నటకుఁ బోద మని400
యెలనాగయును దాను వృషభేంద్రు నెక్కి
బలువిడి నరుదెంచె ప్రమథులు గొలువ. .
అరిగి వేగమె వేంకటాచలాగ్రమునఁ
దరుషండములు ఝరుల్ దరులు గన్గొనుచుఁ

  1. "వగుచు నలనేవంత" వ్రా. ప్ర. పాఠము